ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలి: ఈటల

కరోనా ట్రీట్ మెంట్ పై ప్రైవేటు ఆస్పత్రులు అనుసరిస్తున్న తీరుపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి సమీక్షించారు. కరోనా చికిత్సకు అధిక బిల్లుల వసూళ్లపై ఇప్పటి వరకు 1039 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని.. లేదంటే 50 శాతం పడకలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు మంత్రి ఈటల.

Latest Updates