మోడీ కోసం 20 జెట్లు, 30 చాపర్లు

Private jets booked up across India to give Modi campaign
  • ఐదో వంతుకే పరిమితమైన కాంగ్రెస్
  • ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ పాటిస్తామంటున్న ఆపరేటర్లు

న్యూఢిల్లీ: ఎన్నికలొస్తే చాలు తక్కువ సమయంలోఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు రాజకీయ నాయకులు తప్పనిసరిగా ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లపై ఆధారపడతారు. రాజకీయంగానే కాదు జెట్లు, హెలికాప్టర్ల బుకింగ్ లోనూ పార్టీలు పోటీపడుతున్నాయి. ప్రత్యర్థులపై పైచేయి సాధించేం -దుకు ఆకాశంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరి-స్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం కోసం బీజేపీఏకంగా 20 ప్రైవేటు జెట్లు, 30 హెలికా-ప్టర్లను బుక్ చేస్తే.. కాంగ్రెస్ వాటిలో కేవలం ఐదో వంతుకే పరిమితమైంది. ఈ సారి ఎన్నికలకు దేశంలో అందుబాటులో ఉన్న అన్ని ప్రైవేటు జెట్లు,హెలికాప్టర్లను మూడు నెలల ముందే బీజేపీ బుక్ చేసింది. ప్రత్యర్థి కాంగ్రెస్ కు అవకాశం దక్కకుండా బీజేపీ జాగ్రత్తపడిందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

మంచి రోడ్లు లేకపోవడం, రైల్వే లైన్ల కొరత వల్ల దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి హెలికాప్టర్లు, చిన్న విమానాలు ఎక్కువ ఉపయోగపడతాయి. అయితే మనదేశంలో డిమాండ్ తగ్గట్టు ప్రైవేటు జెట్లు, చాపర్లు అందుబాటులో లేవు. ఎన్నికలప్పుడు వాటికి విపరీతమైన డిమాండ్. పార్టీలు ఈ విషయంలో అడ్వాన్స్ గానే ఉంటున్నాయి. విమానాలు, హెలికాప్టర్లను సాధారణంగా 45 రోజులకు బుక్ చేసుకుంటారు. విమానాలైతే గంటకు 5,700 డాలర్లు, చాపర్లు అయితే గంటకు 7,200 డాలర్ల వరకు చార్జ్ చేస్తారు.

“ఇండియాలో ప్రత్యర్థుల ప్రచారానికి ఆటంకం కలిగించడం సాధారణమే. అయితే రాజకీయ వైరం మునుపెన్నడూ గగనతలం వరకు విస్తరించలేదు.ఒక పార్టీ అన్ని విమానాలు బుక్ చేసుకొని.. ప్రత్యర్థిపార్టీకి అవకాశం దక్కకుండా చేయడం నిజంగానే గెరిల్లా వార్ లాంటిదే” అని మార్టిన్ కన్సల్టింగ్ ఫౌండర్ మార్క్ మార్టిన్ అన్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీకి ఐదు విమానాలు అరెంజ్ చేసిన ఆ పార్టీ కార్యకర్త, 22 ఏళ్ల గులాబ్ సింగ్ పన్వర్ తిరస్కరిం చారు. అధికార పార్టీకే ఎక్కువగా అవసరాలు ఉంటాయని ఆయన అంటున్నారు.

పార్టీలతో సంబంధం లేదు

ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ఆధారంగా పని చేస్తాం ,మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎన్నికల సమయంలోనే మా నష్టాలు కవర్ అవుతాయి. చార్టర్ బ్రోకర్లు ముందుగానే విమానాలు, హెలికాప్టర్లను బుక్ చేసుకుని పార్టీలకు అందజేస్తారు.

– ఆర్కే బాలి, ఎండీ, బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్

 

Latest Updates