అనంతపురంలో ఫోటో గ్రాఫర్ హత్య

అనంతపురం: పట్టణంలోని రాంనగర్ 80 ఫీట్ రోడ్‌లో ప్రైవేటు ఫోటో గ్రాఫర్ మహమ్మద్ రఫీ ఈ తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత విభేదాలు.. లేక అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.  తానే ఈ హత్య చేసినట్లు నిందితుడు హరిజన గోపి నాల్గవ పట్టణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హత్యకు గురైన మహమ్మద్ రఫీ స్వస్థలం కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అనంతపురంలోని మంగళవారి కాలనీలో నివాసం ఉంటున్నాడు. కళ్యాణదుర్గం రోడ్‌లో ఉన్న ఓ మహిళతో  రెండు సంవత్సరాలుగా రఫీ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యకు గురైన మహమ్మద్ రఫీ గతంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వద్ద కొంతకాలం ప్రైవేటు ఫోటో గ్రాఫర్‌గా పనిచేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Latest Updates