ప్రైవేటు స్కూల్ పీఈటీ ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా: దోమకొండ మండల కేంద్రంలో దారుణం జరిగింది. లాక్ డౌన్ తో స్కూల్ లో ఉద్యోగం కోల్పోయి.. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చే అవకాశాలు కనిపించడం లేదంటూ.. మనస్తాపానికి గురైన ప్రైవేటు స్కూల్ పీఈటీ కిశోర్ (32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  లాక్ డౌన్ కారణంగా మార్చి నెలలో పాఠశాలలు మూసివేయడంతో ఉద్యోగం కోల్పోయి.. మరో ఉపాధి దొరకకపోవడంతో స్వగ్రామానికి చేరుకున్నాడు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. కొంత కాలంగా అప్పులు పుట్టకపోవడం.. చేసిన అప్పులు కూడా తీర్చలేకపోవడంతో తీవ్ర వేదనకు గురవుతూ వచ్చాడు. అప్పులు ఇచ్చిన వారికి జవాబులు చెప్పడానికి భయపడుతూ తీవ్రంగా మధనపడిన కిషోర్ చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Latest Updates