అసెంబ్లీ వద్ద ఆత్మహత్యా యత్నం చేసిన నాగులు మృతి

హైదరాబాద్: రెండు రోజుల క్రితం అసెంబ్లీ ఎదుట నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న నాగులు అనే వ్య‌క్తి శ‌నివారం మృతి చెందాడు. ప్రైవేట్ టీచ‌ర్ గా ప‌నిచేస్తున్న నాగులు.. తెలంగాణ వచ్చిన తరువాత తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరుచుకుంటూ ఒంటిపై వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకున్నాడు. బందోబస్తులో భాగంగా అక్కడే వున్న పోలీసులు అతన్ని వెంట‌నే హాస్పిటల్ కు తరలించారు. అయితే అత‌ని ప‌రిస్థితి విష‌మించి శ‌నివారం మ‌ధ్యాహ్నం మ‌ర‌ణించాడు.

ఇది ముమ్మాటికి ప్ర‌భుత్వ హ‌త్యే

నాగులు మృతిపై  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇది ముమ్మాటికి ప్ర‌భుత్వ హ‌త్యేన‌ని అన్నారు. తెలంగాణా వచ్చినా కూడా ప్రజలకు ఏమి లాభం జరగలేదని నాగులు వాపోయారని , అత‌ని మరణం ప్రభుత్వ హత్యానేనని అన్నారు. అమరవీరుల ఆత్మత్యాగాలతో వచ్చిన తెలంగాణ ఫలితాలు… కేవ‌లం ఒక్క సీఎం కుటుంబానికి దక్కుతున్నాయని నాగులు ఆవేదన చెందాడ‌ని అన్నారు. నేడు తెలంగాణ‌ యువత కూడా అదే‌ ఆవేదన వ్య‌క్తం చెందుతున్న‌ద‌ని అన్నారు.

 ఇది ముమ్మాటికి ప్ర‌భుత్వ హ‌త్యే

Latest Updates