దేశ వ్యతిరేక పోస్టులు: కశ్మీరీ స్టూడెంట్లపై వర్సిటీ సస్పెన్షన్

హరిద్వార్: పుల్వామా దాడి నేపథ్యంలో ఏడుగురు కశ్మీరీ విద్యార్థులు ఫేస్ బుక్ లో దేశ వ్యతిరేక పోస్టులు చేశారు. ఇది యూనివర్సటీ అధికారుల దృష్టికి రావడంతో వారిని సస్పెండ్ చేశారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లా రూర్కీలోని ఈ ఘటన జరిగింది.

ఇక్కడి భగవాన్ పూర్ ప్రాంతంలోని క్వాంటం గ్లోబల్ యూనివర్సిటీలో చదువుతున్న ఏడుగురు కశ్మీర్ యువకులు పుల్వామా దాడిపై ఫేస్ బుక్ పోస్టులు పెట్టారు. అయితే వారు దేశ వ్యతిరేక నినాదాలను పోస్ట్ చేశారంటూ వర్సిటీలోని 450 మంది విద్యార్థులు నిరసనకు దిగారు. వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీలో వారైనా ఉండాలి లేదా తామైనా ఉండాలని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు.

నిరసనలు ఉప సంహరించకపోవడంతో వారిని శాంతింపజేయడానికి తాము ఏడుగురు కశ్మీరీ విద్యార్థులను సస్పెండ్ చేశామని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. దీనిపై తాము విచారణ జరిపిస్తున్నామని, వారు తప్పు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Latest Updates