ముందు అమ్మాయిలు మారాలి

మగాళ్లు మారాలి, ఆడవాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి అంటుంటారు అందరూ. కానీ ముందు ఆడవాళ్లు మారాలి అంటోంది ప్రియాంకాచోప్రా. ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ గురించిన ప్రశ్న ఎదురైంది పీసీకి. దానికామె చాలా సూటిగా, స్పష్టంగా జవాబు చెప్పింది. ‘ఇలాంటి ప్రశ్నలు చాలాసార్లు ఎదురయ్యాయి నాకు. మరో హీరోయిన్‌‌తో కలిసి నటిస్తున్నారు కదా, పోటీ ఫీలవుతున్నారా అని అడుగు తుంటారు. ఎందుకు ఫీలవుతాం? ఎవరి పని వారిది. విచిత్రమేమిటంటే ఇలా అడిగేవాళ్లలో ఆడవాళ్లు కూడా ఉంటారు’ అంది కోపంగా. ‘అమ్మాయిలకి అవకాశాలు రావట్లేదంటూ బాధపడటం వల్ల ఉపయోగం లేదు. అవకాశాలను అంది పుచ్చు కోవాలి. ముఖ్యమైన పొజిషన్స్‌‌లో ఆడవాళ్లు ఉండేలా చూసుకోవాలి. దానికి అమ్మాయిలంతా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఆడవాళ్లు ఏదైనా చేయగలరు. వాళ్లలో కనిపించని శక్తి ఉంటుంది. దాన్ని ముందు మనం తెలుసుకోవాలి’ అంటోంది పీసీ. ఇంత క్లారిటీ ఉంది కనుకే ప్రపంచమంతా గుర్తించేంత పాపులర్ అయ్యింది తను.

Latest Updates