ప్రియాంక తర్వాతే ఎవరైనా!

చేసే ప్రతి పనిలోనూ బెస్ట్ అనిపించుకోవడం ప్రియాంకా చోప్రాకి మొదట్నుంచీ అలవాటు. అందాల పోటీల్లో కిరీటం దక్కించుకుంది. నటిగా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ అయ్యింది. హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడా పాపులర్​ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆమే బెస్ట్ అంటున్నారు నెటిజన్స్.  సోషల్​ మీడియాలో ప్రియాంక చాలా యాక్టివ్. దాంతో ఆమె కోసం నెట్​లో వెతికేవాళ్లు ఎక్కువే. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది సెర్చ్ చేసే ఇండియన్ యాక్ట్రెస్ ఎవరు అని ఆరా తీస్తే.. ప్రియాంక అని తేలింది. పోయినేడు అక్టోబర్‌‌ నుంచి ఈ యేడు అక్టోబర్‌‌ వరకు 2.74 మిలియన్ల సార్లు ప్రియాంక గురించి నెట్‌లో సెర్చ్ చేశారట. ఆమె వార్తల కోసమో, ఫొటోల కోసమూ తరచూ ఎవరో ఒకరు వెతుకుతూనే ఉంటారట. దీపికా పదుకొనె, సన్నీ లియోనికి కూడా ఫాలోయింగ్ ఎక్కువే ఉన్నా.. ప్రియాంక తర్వాతే ఎవరైనా, ఆమెదే ప్రథమ స్థానం అంటున్నారు సర్వే చేసినవాళ్లు.

 

Latest Updates