అమెజాన్‌తో ప్రియాంకా చోప్రా మరో భారీ డీల్‌

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా అమెజాన్‌ ప్రైమ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. కోట్లాది  రూపాయల విలువ చేసే ఫస్ట్‌ లుక్‌ అనే టెలివిజన్‌ డీల్‌పై ఆమె సంతకం చేశారు. ఇందుకోసం ఆమె రెండేళ్లపాటు అమెజాన్‌తో కలిసి పని చేయనున్నారు. ఇంగ్లిష్, హిందీ బాషల్లో రూపొందిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ టీవీ కార్యక్రమాల్లో మరింత భారతీయతను ప్రదర్శిస్తామని ప్రియాంక తెలిపారు. అంతేకాదు మహిళలకు సంబంధించిన కథలను చూపించాలనేదే తన కోరికని… ఆ కథలను విభిన్నంగా చూపించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప క్రియేటర్స్ తో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. అందుకు అమెజాన్‌ లాంటి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగి ఉన్న భాగస్వామి దొరకడం ఆనందంగా ఉందన్నారు.

వైవిధ్యమైన కథంశాలను తెరకెక్కించాలనే విషయంలో ప్రియాంకదీ, నాదీ ఒకే విధమైన ఆలోచన అని తెలిపారు అమెజాన్‌ స్టూడియోస్‌ అధినేత జెన్నీఫర్‌ సాల్కే. ప్రపంచమంతా మెచ్చే వాస్తవికమైన కంటెంట్‌ను అందించేందుకే ఆమెతో చేతులు కలిపామన్నారు.

రెండు అమేజాన్ ప్రాజెక్ట్ లలో ఇప్పటికే ప్రియాకం చోప్రాకు పార్ట్ నర్ షిప్ ఉంది.

Latest Updates