చెప్పకుండా సినిమా నుంచి తీసేశారు: ప్రియాంక

ఒక స్థాయికి చేరుకోవాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సిందే. అందుకు తాను కూడా అతీతం కాదంటోంది ప్రియాంకా చోప్రా. బాలీవుడ్‌‌‌‌ హీరోయిన్‌‌‌‌గా కెరీర్ మొదలుపెట్టి హాలీవుడ్‌‌‌‌ దాకా ఎదిగిందామె. అయితే ఆ పొజిషన్‌‌‌‌కి వెళ్లడానికి ఎన్నో కష్టాలు పడ్డానని చెబుతోంది. ‘నేను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయి. ఎంతో వేదన ఉంది. కెరీర్​ ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక సినిమాలో క్యారెక్టర్ ఓకే అయ్యేది. తర్వాత సడెన్‌‌‌‌గా ఆ సినిమా నుంచి తొలగించేసేవారు. కారణం కూడా చెప్పేవారు కాదు. డైరెక్టర్స్​అయితే షూటింగ్​ టైమ్‌‌‌‌లో అందరి ముందు అరిచేవారు కూడా.  చాలా ఏడుపొచ్చేది. సినిమా నుంచి తొలగించేయడం చాలా సిగ్గుగా కూడా ఉండేది. అటువంటప్పుడు మా నాన్నే నన్ను ఓదార్చేవారు. ఎలాంటి కష్టమొచ్చినా ఎదుర్కోవాలని నా వెన్నుతట్టి ధైర్యాన్నిచ్చేవారు. మెల్లగా ఎదుర్కొనేందుకు సిద్ధపపడ్డాను. అవమానాలను దిగమింగాను. ఏ విషయాన్నైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి డెసిషన్​ తీసుకునేదాన్ని. దానికితోడు షూటింగ్​ సమయాల్లో పగలనక, రాత్రనక కష్టపడేదాన్ని. అవన్నీ కలిసి ఈ రోజు నన్నీ స్థితిలో నిలబెట్టాయి’ అంటూ చెప్పుకొచ్చింది పీసీ. ఆమె నటించిన ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఆ మూవీ  ప్రమోషన్స్‌‌‌‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఇవన్నీ చెప్పింది ప్రియాంక

Latest Updates