ప్రియాంకకు సిగరేట్ సెగ

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కి ట్రోలింగ్ తో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఒకప్పుడు ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. దీపావళిని దీపాలతో జరుపుకోవాలి కానీ.. పటాసులు కాల్చి కాలుష్యానికి కారణం కావద్దు’ అంటూ నీతులు చెప్పిన ఈ బాలీవుడ్‌ బామ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ ను ఎదుర్కొంటుంది. జులై 18న ప్రియాంక బర్త్ డే. ఈ సందర్భంగా ప్రియాంక.. భర్త నిక్‌ జోనస్‌ తో కలిసి పుట్టిన రోజు సంబరాలను ఘనంగా జరుపుకుంది. ప్రస్తుతం ఫ్లొరిడాలోని మయామిలో ప్రియానిక్‌ జోడి సేద తీరుతుండగా.. ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా వారితోనే ఉన్నారు.

అయితే ఈ ముగ్గురు కలిసి సిగరెట్ తాగుతున్న ఓ ఫొటో నెట్టింట హల్‌ చేస్తోంది. అందులో ప్రియాంక చోప్రా స్మోకింగ్ చేస్తుంది. ఫొటోను చూసిన అభిమానులు.. ఒక్కసారిగా ఆమె గతంలో చెప్పిన నీతులని ప్రస్తావిస్తూ.. ‘అప్పుడు ఏం చెప్పి.. ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి’  అంటూ సెటైరిక్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

సిగరేట్‌ కాల్చిన ఫొటోలతో ప్రియాంకను ట్రెండ్‌ చేస్తున్నారు. ఆస్తమ రోగులకు అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రియాంక చేసిన కామెంట్స్ ను కూడా గుర్తు చేస్తున్నారు. ఐదేళ్లప్పుడు తాను ఆస్తమ వ్యాధితో బాధపడ్డానని, ఆ వ్యాధి తన కలలకు అడ్డుగా నిలవలేదని ఆస్తమ వ్యాధిగ్రస్తులను చైతన్య పరిచే కామెంట్స్ చేసింది ప్రియాంక. ఆస్తమా రోగులు ఈ ఫొటో చూడొద్దంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. ప్రియాంక తాగేది పతంజలి సిగరేట్ కావచ్చు అంటూ వెటకారం చేస్తున్నారు.

Latest Updates