ప్రజలు పిచ్చోళ్లు కాదు

వారణాసి: కాంగ్రెస్​ కుటుంబ వారసత్వ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయన్న ధాని మోడీకి కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఘాటుగా బదులిచ్చారు. గడిచిన ఐదేండ్లలో నరేంద్ర మోడీ వ్యవస్థల్ని ఎలా నాశనం చేశారో జనమంతా చూశారని,ప్రజల్ని ఫూల్స్​గా లెక్కగడ్డం ప్రధాని ఇకనైనా మానుకోవాలని, మంచిచెడుల్ని జనం గ్రహిస్తారని అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక చేపట్టిన గంగా యాత్ర బుధవారంతో ముగిసింది. చివరి మజిలీగా వారణాసిలోని అస్సీ ఘాట్​కు చేరుకున్న

కాంగ్రెస్​ నేత కాశీ విశ్వనా థ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సాధువుల ఆశీర్వాదాలు తీసుకు న్నారు. బెదిరిస్తే భయపడం పీఎం మోడీ తన బ్లాగ్​లో రాసిన వ్యాసంపై స్పందిం చిన ప్రియాంక, ‘‘అధికారంలో ఉన్నోళ్లకు రెండు రకాల అభిప్రాయాలుంటాయి. ఒకటి, ప్రజల్ని చాలా సులువుగా తప్పుదోవపట్టించొచ్చుని అను కుంటారు. రెండోది అధికార దండంతో అందరినీ బెదిరిస్తారు. వీళ్ల బెదిరింపులకు కాంగ్రెస్​ భయపడదు. మమ్మల్ని ఏం చేసినా, ఎంతలా వేధించినా పోరాడుతూనే ఉంటాం . గత ఐదేండ్ లుగా మోడీ పద్ధతి ప్రకారం ఇనిస్టిట్యూ షన్స్​ని నాశనం చేశారు. మీడియా గొంతునొక్కిందీ ఆయనే. పని చేయకుండా కేవలం ప్రచారంతో నే గెలవొచ్చనుకుంటున్నారు. అలాంటి వాళ్లకు జనం గట్టిగా బుద్ధి చెప్పాలి’’అని అన్నారు.

Latest Updates