మోడీ అహంకారమే..అతడిని ఓడిస్తుంది : ప్రియాంక గాంధీ

అంబాలా : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీపై సీరయస్ అయ్యారు కాంగ్రెస్ చీఫ్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.  మంగళవారం హర్యానాలోని అంబాలాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంకాగాంధీ..మోడీని దుర్యోధనుడితో పోల్చారు. మోడీ దుర్యోధనుడిలా దురహంకారి అని, ఆయన అహంకారమే ఈ ఎన్నికల్లో ఓటమికి కారణమవుతుందన్నారు. బీజేపీ నాయకులు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి ఎక్కడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రియాంకాగాంధీ తిప్పికొట్టారు. మోడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Latest Updates