ఇవాళ యూపీలో పర్యటించనున్న ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెల్లెలు.. AICC ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్ పర్యటనకు రెడీ అయ్యారు. రాహుల్ గాంధీతో పాటు, ప్రియాంక, జ్యోతిరాధిత్య సింధియాలు ఇవాళ ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నారు. ప్రియాంక, జ్యోతిరాధిత్యలు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. మీ అందరినీ కలిసేందుకు నేను లక్నో వస్తున్నాను. మనమంతా కలసి కొత్త రాజకీయాలు ప్రారంభిద్దాం. ఆ రాజకీయాల్లో మీరంతా భాగస్వాములు కావాలి. అందరి గొంతు వినిపించాలంటూ ఆడియో మెసేజ్ ఇచ్చారు ప్రియాంక.

ప్రియాంక పర్యటనకు ఉత్తరాదిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా హాజరుకాబోతున్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ సహా.. అనేకమంది నేతలు ఇప్పటికే లక్నో చేరుకున్నారు. 14వరకు ఉత్తరప్రదేశ్ లో ఉండనున్న ప్రియాంక… లోక్ సభ ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తారు. ఎన్నికల ప్రణాళిక, వ్యూహాలు ఖరారు చేసేందుకు సమావేశాల్లో పాల్గొంటారని ఉత్తరప్రదేశ్ PCC చీఫ్ రాజ్ బబ్బర్ చెప్పారు. ఫిబ్రవరి 18 నుంచి ప్రియాంక, జ్యోతిరాధిత్య సింధియాలు ప్రజలు, వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశాలు జరుపుతారు.

ప్రియాంక పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. రాష్ట్ర కాంగ్రెస్ ఆఫీస్ లో ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నేతలు. అలాగే లక్నోలో కటౌట్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ టీషర్టులు పంపిణీ చేశారు.

Latest Updates