ఢిల్లీ బిడ్డగా మోడీకి నేను విసిరే సవాల్ ఇదే…? : ప్రియాంకా గాంధీ

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ పంచ్ డైలాగులు పేల్చారు. ఆమె ఢిల్లీలో ఇవాళ భారీ రోడ్ షోలు నిర్వహించారు. ఎంపీ అభ్యర్థులు షీలాదీక్షిత్, విజేందర్ సింగ్ లకు మద్దతుగా ప్రచారం చేశారు. రోడ్ షోల్లో ప్రధానమంత్రి మోడీ లక్ష్యంగా విమర్శలు చేశారు.

కాంగ్రెస్ .. బీజేపీకి పోటీ ఇవ్వలేకపోతోందని… లోక్ సభ చివరి రెండు ఫేజ్ ల ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఇమేజ్ పైన పోటీచేయాలని ఇటీవల నరేంద్రమోడీ చురకలు వేశారు. నంబర్ వన్ అవినీతిపరుడుగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ జీవితం ముగిసిందని ప్రధాని ఇటీవల విమర్శించారు. దీనికి ప్రియాంక గాంధీ వాద్రా బదులిచ్చారు.

“ఢిల్లీలో పుట్టి పెరిగిన అమ్మాయిగా మోడీకి సవాల్ విసురుతున్నా. చివరి రెండు ఫేజ్ లలో నోట్లరద్దు, జీఎస్టీ, మహిళలకు రక్షణ, యువతకు ఇచ్చిన హామీలపై పోటీకి రండి.’ అన్నారు.

“హోమ్ వర్క్ చేయకుండానే స్కూలుకు వచ్చే పిల్లలలాంటి పరిస్థితి బీజేపీది. నెహ్రూ నా పుస్తకం తీసుకున్నాడు.. దాచేశాడు. నా హోంవర్క్ బుక్ నుంచి పేపర్లు చింపి ఇందిరాగాంధీ కాగితపు విమానాలు చేసింది. అందుకే హోమ్ వర్క్ చేయకుండా వచ్చాను అని స్కూలు పిల్లలు చెప్పినట్టుగా ఉంది” అని మోడీపై సెటైర్లు వేశారు.

Latest Updates