షాద్‌నగర్‌ పీఎస్ దగ్గర నిరసనకారులపై లాఠీచార్జ్

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వెర్నరీ డాక్టర్‌పై దారుణానికి పాల్పడిన నిందితులపై వెంటనే శిక్షించాలంటూ పీఎస్‌ను ఉదయం నుంచి జనం చుట్టుముట్టారు. నిందితులపై కనికరం చూపొద్దంటూ ఆక్రోశంతో నినాదాలు చేశారు నిరసనకారులు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌ను వేలాదిగా జనం చుట్టుముట్టి… న్యాయం చేయాలంటూ గర్జించారు. ‘మాకు అప్పగిస్తారా? మీరు ఎన్‌కౌంటర్ చేస్తారా’ అని జనాలు ఆక్రోశంతో గర్జిస్తున్నారు. కోర్టులు.. జైళ్లు వద్దు.. రెండే నిమిషాల్లో వాళ్ల అంతం చూస్తాం.. షాద్ నగర్‌లోనే ప్రజా తీర్పు ఇస్తామంటూ జన దిగ్భంధం చేశారు.
షాద్ నగర్ సహా చుట్టుపక్కల గ్రామాల జనం అక్కడికి చేరుకోవడంతో పోలీసులకు వారిని నియంత్రించడం కష్టంగా మారింది. బారికేడ్లను సైతం ఎత్తిపక్కన పడేశారు. దీంతో శాంతించాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పదే పదే మైక్‌లో చెప్పారు పోలీసులు.

MORE NEWS: 

మాకు అప్పగిస్తరా? ఎన్‌కౌంటర్ చేస్తరా?: షాద్ నగర్ పీఎస్ దగ్గర జనాక్రోశం

రేప్ చేస్తే ఏ దేశంలో ఏ శిక్ష?

మధ్యాహ్నం మూడు గంటల సమయం దాటినా నిరసనలు ఏమాత్రం తగ్గలేదు. ఇంకా జనం పెరుగతుండంతో నిందితులను కోర్టుకు తరలించడం లాంటి ప్రొసీజర్‌కు ఇబ్బందిగా మారింది. ఒక సమయంలో జనంలో కొంత మంది రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు జనాలపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ సమయంలో జనం పరుగులు తీయడంతో మహిళలు కిందపడిపోయారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో తప్పు చేసిన వాళ్లను లోపల పెట్టి.. జనంపై ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Updates