షీ టీమ్ నంబర్ ఇదే.. మన బిడ్డలకు చెప్పండి

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై జరిగిన ఘోరం మన రాష్ట్రంతో పాటు దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. సాయం చేస్తామని చెప్పి.. అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. దాదాపు మూడు గంటలపైగా ఆమెను హింసపెట్టి.. హత్య చేసి.. ఆనవాలు దొరక్కుండా చేయాలని పెట్రోల్ పోసి తగలబెట్టారు. తోటి వారిని నమ్మాలంటే భయపేడేలా చేసిన ఈ అమానవీయ ఘటన ఒక్కసారిగా ఆడబిడ్డలున్న కుటుంబాల్లో వణుకు పుట్టించింది.

ధైర్యం నింపే ప్రయత్నంలో ప్రభుత్వం

దీంతో ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేసును వేగంగా కొలిక్కి తెచ్చి.. నిందితులకు కఠినంగా శిక్షలు పడేలా చేస్తామని సీటీ పోలీసులు చెబుతున్నారు. అమ్మాయిలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా తామున్నామనే భరోసా ఇస్తున్నారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్ రాత్రి వేళల్లో  ఏ సమయంలోనైనా బైక్ రిపేర్లు వస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు రాచకొండ పోలీసులు. 9490617111 అనే వాట్సప్ నెంబర్‌కు లొకేషన్ షేర్ చేయాలని కోరారు. వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది మహిళలకు సాయం చేస్తారన్నారు. అలాగే మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మన బిడ్డలు ధైర్యంగా ఉండాలని,  ప్రతి అమ్మాయి షీ టీమ్ ఫోన్ నంబర్ తన ఫోన్‌లో ఉంచుకోవాలని కోరారామె. ఏ సమస్య వచ్చినా వెంటనే ఫోన్ చేస్తే సాయం అందుతుందని చెప్పారు.

ధైర్యం కోల్పోవద్దు

‘రాత్రి పగలు అనే తేడా లేకుండా నేరాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏ ఘోరం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనల్ని కాపాడుకోవడం మొదటగా మనం అప్రమత్తం కావాలి. ఏ మాత్రం సమస్య వచ్చినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా.. ఆ కష్టం నుంచి బయటపడే మార్గం చూసుకోవాలి. సో, మన బిడ్డల్ని కష్టం వచ్చినప్పుడు దైర్యం కోల్పోకుండా ఉండేలా పెంచాలి’ అంటున్నారు మనోవికాస నిపుణులు.

షీ టీమ్ నంబర్లు

ప్రియాంక రెడ్డి ఘటనలోనూ ఆమె తన చెల్లెలికి ఫోన్ చేసిన సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించి, వారు స్పందించి ఉన్నా ఈ ఘోరం జరగకుండా ఆపే అవకాశం ఉండేదేమో. చిన్న ఆలస్యం కూడా ఎంతటి దారుణానికైనా దారి తీయొచ్చు. సో, రాత్రి వేళల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవైనా అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు భయపడి షాక్‌లోకి వెళ్లకుండా.. షీ టీమ్స్ ఎప్పుడూ రక్షణగా ఉంటాయని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. ‘అమ్మాయి అంటే మరో అమ్మ.. అమ్మే సృష్టికి మూలం. ఆమ్మను రక్షించుకుందాం’ అని నినాదంతో పని చేస్తోంది షీ టీమ్. ఏవైనా సమస్య వస్తే అండగా ఉంటామని, తమ నంబర్లు ప్రతి అమ్మాయి ఫోన్‌లో సేవ్ చేసుకోవాలని కోరుతున్నారు షీ టీమ్ పోలీసులు. 100కు ఫోన్ చేసినా వెంటనే సాయం అందుతుందని చెబుతున్నారు.

షీ టీమ్ వాట్సాప్ నంబర్: 9490617444 ఈ నంబర్‌కు లొకేషన్ షేర్ చేసి, సమస్యను వెంటనే తెలియజేస్తే షీ టీమ్ వస్తుంది.

నేరుగా షీ టీమ్‌కు ఫోన్ చేసి కూడా వారి సాయం తీసుకోవచ్చు.

ఏరియాల వారీగా నంబర్లు

బాలానగర్:  9490617349

ఐటీ కారిడార్: 9490617352

గచ్చిబౌలి: 9490617352

మాదాపూర్: 8332981120

మియాపూర్: 9491051421

శంషాబాద్: 9490617354

పేట్‌ బిషీరాబాద్: 7901099439

రాజేంద్రనగర్: 7901099438

ఈ – మెయిల్ ఐడీ sheteam.cyberabad@gmail.com

ఫేస్‌ బుక్ ఐడీ : sheteam.cyberabad

ట్విట్టర్: @cyberabadpolice

మరికొన్ని నంబర్లు

నిర్భయ: 98333 12222

ఓఆర్ఆర్ పోలీస్ పెట్రోలింగ్: 79010 99445

రాచకొండ పోలీస్ వాట్సాప్: 94906 17111

ఇంటిలోనే మన బిడ్డలకే చెప్పాలి

ఆడ బిడ్డలపై దారుణాలను నియంత్రించాలంటే సెక్యూరిటీ పెరగాల్సిన అవసరం ఉంది. దానితో పాటు నేరాలు చేసేవాళ్లలోనూ మార్పు రావాలి. నేరాలను నియంత్రించే కన్నా.. నేరాలు చేయాలన్న ఆలోచననే చంపేయడం మేలు. దీనికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దోషులను కఠినంగా శిక్షించడం ఒక మార్గం. రెండో మార్గం చిన్నప్పటి నుంచే పిల్లల్లో నేర ప్రవృత్తి అలవడకుండా చూడడం. మగపిల్లలకు తల్లిదండ్రులు, టీచర్ల మార్గదర్శనం. పరాయి ఆడపిల్లను చూసే తీరు ఎలా ఉండాలన్నది చిన్న వయసు నుంచే నేర్పాల్సిన అవసరం ఉంది. అమ్మ, చెల్లి పట్ల ఎలా ఉంటావో.. అలానే పరాయి అమ్మాయి పట్ల కూడా ఉండాల్సిన్న ఆలోచన బుర్రలో నాటుకుపోయేలా పిల్లల్ని తీర్చిదిద్దాలి.

MORE NEWS: 

పథకం ప్రకారమే ప్రియాంక స్కూటీ పంక్చర్

నిద్రపోవడమే జాబ్.. జీతం లక్ష: ఇండియన్స్ అంతా అప్లై చేసుకోవచ్చు

Latest Updates