ప్రియాంకనే రోల్ మోడల్: విజయేందర్ సింగ్

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాం ధీ తనకు ఆదర్శమని బాక్సర్ విజేందర్ సింగ్ అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మనువరాలైన ప్రియాంక సింప్లిసి టీకి ఇంప్రెస్ అయ్యానని చెప్పారు. సౌత్ ఢిల్లీ లోక్​సభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున విజేందర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రియాం కాజీ సింప్లిసి టీ అంటే నాకు ఎంతో ఇష్టం . ఆమె మాట్లాడే తీరు, నడిచే తీరులో ఇందిరా గాంధీ పోలికలు కనిపి స్తాయి. ఆమె నన్ను ఇంప్రెస్ చేశారు  అని వివరించారు.

వాళ్లు పోటీనే కాదు…

తనపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ థి రమేశ్ బిధురి మంచి వ్యక్తి కాదని, ఆమ్ ఆద్మీ పార్టీ కేండిడేట్ రాఘవ్ చద్దా ఓ బచ్చా అని విమర్శిం చారు. బీజేపీ, ఆప్ అభ్యర్థులతో నాకు పోటీ లేదు. నేను అబద్ధా లు చెప్పను. నేనొక బస్ డ్రైవర్ బిడ్డను . మాది రైతు కుటుంబం. సున్నా నుంచి నా జీవితాన్ని ప్రారంభించా. వసంత్ కుంజ్ లో ఉంటున్నా అని వివరించారు. ప్రస్తుత ఎంపీ బిధురిని మళ్లీ ఎన్ను కోవాలని ప్రజలు కోరుకోవట్లేదు. ఎందుకంటే అతనో చెడ్డ వ్యక్తి . ఇక ఆ బచ్చా (చద్దాని ఉద్దేశి స్తూ) గురించా? అతడి గురిం చి నాకేం తెలీదు అని విమర్శించారు. కేజ్రీవాల్, ఆయన మోసపూరిత హామీలతో ఢిల్లీ ప్రజలు విసిగి పోయారన్నారు. పేద ప్రజల కోసం వారు ఎన్నో మంచి పనులు చేయొచ్చని, కానీ ఏసీ రూముల్లో ధర్నాలు చేయడానికే వారికి సరిపోయిందని ఎగతాళి చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్​ను మెరుగుపరుస్తామని, స్వచ్ఛమైన నీటిని అందుబాటులో ఉంచుతామని ఆప్ హామీ ఇచ్చిందని, కానీ అవేవీ నెరవేర్చలేదని మండిపడ్డారు.

యవకులం వచ్చాం…

గత అసెంబ్ లీ ఎన్నికల్లో ఆప్ గెలుపుతో ఢిల్లీలో కాంగ్రెస్ డీలా పడిపోయిం ది. ఇప్పుడు పార్టీలో యువకులు ఉన్నారు. పార్టీ కొత్తగా ఓ టీంను ఏర్పాటు చేసింది. మాకు అండగా సీనియర్ నేత షీలా దీక్షిత్ ఉన్నారు. మేం కాన్ఫిడెంట్​గా ఉన్నాం”అని విజేం దర్ చెప్పారు. ‘‘నేను ఎన్నికలకు కొత్తనే. కానీ నా నియోజకవర్గం లో ఉన్న సమస్యల గురించి నాకు తెలుసు. అక్రమ నిర్మా ణాలు, ఆక్రమణలు, ఫ్యాక్టరీల మూసివేత వంటివి జరుగుతున్నాయి.చిన్న వ్యాపారులు టార్గెట్ అవుతున్నారు. వారి భూములు, ఆస్తులను లాక్కుం టున్నారు” అని ఆరోపించారు.‘ప్రస్తుత ప్రభుత్వాన్ని చూసి ప్రజలు వణికిపోతున్నారు. ఇక్కడ భయంకరమైన వాతావరణం ఉంది. ఆ భయాన్ని నేను తొలగిస్తా. అలాగే స్పోర్స్ట్ కు సదుపాయాలు పెంచాలి అని చెప్పారు.

అందుకే కాంగ్రెస్​లోకి….

కాంగ్రెస్ ఐడియాలజీ తనకు నచ్చిందని, ఆ పార్టీ యువతపైనే దృష్టి పెట్టిందని విజేందర్ అన్నారు. మీరు కూడా అక్కడి(కాం గ్రెస్​లోకి)కి వెళ్లండి. మీఆలోచనలు వారితో మ్యాచ్ అవుతాయి. నేను ఫైట్స్ తో బిజీగా ఉంటున్నా.. మోడీ, ప్రియాం క, రాహుల్ తదితరులతో టచ్ లో ఉండేవాడిని అని చెప్పారు. ఫేక్ నేషనలిజం గురిం చి కాం గ్రెస్ మాట్లాడదన్నారు. ఇప్పుడు దేశంలో మోడీ వేవ్ లేదు. పెద్దపెద్ద బ్యానర్లు, హోర్డిం గులు చూసి వేవ్ ఉందని ఫీలు అవుతున్నారు. జాగ్రత్తగా గమనిస్తే అలాంటి దేమీ లేదని అర్థమవుతుంది. రియాలిటీ డిఫరెంట్​గా ఉంటుంది.”అని చెప్పారు.

Latest Updates