ప్రైజ్ మనీ ఇచ్చేశాం: బీసీబీ

ఢాకా: ఐసీసీ టోర్నీల్లో గెలిచిన ప్రైజ్ మనీని ప్లేయర్లకు ఇవ్వడం లేదని తమపై వచ్చిన ఆరోపణలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తోసిపుచ్చింది. ప్రైజ్ మనీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చామని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఉన్న బకాయిలనూ చెల్లించామని తెలిపింది. ‘లాస్ట్ ఐసీసీ ఈవెంట్ అయిన వన్డే వరల్డ్ కప్ తో సహా గతంలో జరిగిన అన్ని ఈవెంట్లకు సంబంధించిన ప్రైజ్ మనీని ప్లేయర్లకు పంచేశాం. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసి యేషన్ (ఫికా) చేసిన ఆరోపణలు అవాస్తవం’ అని బీసీబీ పేర్కొంది.

బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్ )లో తలెత్తిన పేమెంట్ ఇష్యూపైనా వివరణ ఇచ్చింది. ‘కొన్ని ఎడిషన్స్ లో పేమెంట్స్ విషయంలో గందరగోళం తలెత్తింది. పేమెంట్ సిస్టమ్ ను రీస్ర్టక్చర్ చేసి ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేశాం. ముగ్గురు ఫారిన్ ప్లేయర్లు, ఓ కోచ్‌‌ విషయంలో ఇంకా సమస్య ఉంది. దానిని త్వరలోనే పరిష్కరిస్తాం ’ అని బీసీబీ స్పష్టం చేసింది.

Latest Updates