దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటోంది: మోడీ

"Pro-Incumbency Wave In Country For First Time," Says PM Modi In Varanasi

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వారణాసిలో నామినేషన్‌ వేయనున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఆయన వారణాసిలోని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో మొదటిసారి ప్రోఇంకంబెన్సీ వేవ్ కనిపిస్తోందని మోడీ అన్నారు.  తాను బూత్ కార్యకర్తగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. కాశీ ప్రజల ప్రేమ, ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని దేశమంతా చెబుతోందన్నారు. ప్రస్తుతం వారణాశిలోని కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్న మోడీ.. మరికొద్దిసేపటిలో తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.

 

Latest Updates