లాక్ డౌన్ ఉల్లంఘించిన 6నెలలు, 3ఏళ్ల చిన్నారులపై ఎఫ్ఐఆర్ నమోదు

లాక్ డౌన్ ఉల్లంఘించిన 51మంది పై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. వారిలో 6నెలలు చిన్నారి, 3ఏళ్ల చిన్నారులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయడం వివాదాస్పదమైంది.

శుక్రవారం ఉదయానికి కేంద్రం తెలిపిన కరోనా వైరస్ వివరాల ప్రకారం

గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకి  4,500 కు పైగా మరణించినట్లు కేంద్రం తెలిపింది. 186,462మందికి కరోనా వైరస్ సోకగా యాక్టీవ్ గా ఉన్న కేసుల సంఖ్య 68,017 ఉన్నట్లు తెలుస్తోంది.

 మనదేశంలో కరోనా కేసులు

మనదేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య  23,000 మార్క్ దాటింది.  శుక్రవారం ఉదయానికి  మరణాల సంఖ్య 718 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఉత్తరా ఖండ్ లో చిన్నారులపై ఎఫ్ ఐఆర్ నమోదు

హిందుస్తాన్ టైమ్స్ కధనం ప్రకారం ఉత్తరాఖండ్  లో శుక్రవారం కొత్తగా 51కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా లాక్ డౌన్ ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తుంది. ఉత్తర ఖండ్ ఉత్తరాక్షిలో లాక్ డౌన్ ఉల్లంఘించిన 51మందిపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. వారిలో 6నెలలు మరియు 3ఏళ్ల చిన్నారులు ఉండడం గమనార్హం.

అయితే చిన్నారులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయడానికి న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. జువైనల్ యాక్ట్ ప్రకారం 8ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయకూడదు. జువైనల్ యాక్ట్ ను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Latest Updates