బండ్ల గణేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ను బంజారాహీల్స్  పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు తీసుకుని ఇవ్వకపోగా.. నిర్మాత పీవీపీని బెదిరించిన కేసులో గణేశ్ ను  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. టెంపర్ సినిమాకు ఫైనాన్స్ విషయంలో  వీళ్లిద్దరి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు తలెత్తాయి. ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెంపర్ సినిమాకు బండ్ల గణేశ్ పీవీపీ దగ్గర రూ.30 కోట్లు ఫైనాన్స్ తీసుకున్నాడు. అందులో రూ.7 కోట్లు తిరిగి ఇవ్వలేదని ఆధారాలతో  పోలీసులకు ఫిర్యాదు  చేశారు పీవీపీ .  అయితే కొన్ని రోజుల క్రితం బండ్ల గణేశ్ అనుచరులు తనను బెదిరించారని పీవీపీ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బండ్ల గణేశ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates