ఆన్‌‌లైన్‌‌ పోర్టల్‌‌పై అమ్మే ప్రొడక్ట్‌‌ ఏ దేశానికి చెందినదో చెప్పాలి

  • ఆన్​లైన్​ కంపెనీలతో డీపీఐటీ భేటీ
  • ప్రొడక్ట్ ‘కంట్రీ ఆఫ్ ఒరిజిన్’పై నిర్ణయం
  •  వైరల్ అయిన యాంటీ చైనా సెంటిమెంట్

ఆన్‌‌లైన్‌‌ కంపెనీలతో డీపీఐఐటీ ఇవాళ సమావేశం కానుంది. తమ ప్లాట్‌‌ఫామ్స్ ‌పై అమ్మే ప్రతి ప్రొడక్ట్‌‌ ఏ దేశానికి చెందినదో తప్పనిసరిగా తెలుపాలని దేశీయ ట్రేడర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వెల్లువెత్తుతోన్న ఈ క్రమంలో డీపీఐఐటీ ఈ మీటింగ్ నిర్వహిస్తోంది.  అమెజాన్, ఫ్లిప్‌‌కార్ట్, స్నాప్‌‌డీల్, నైకా, పెప్పర్‌‌‌‌ఫ్రై, ఈబే వంటి ఆన్‌‌లైన్‌‌ కంపెనీల ప్రతినిధులు ఈ మీటింగ్‌‌కు హాజరుకాబోతున్నారు. వీడియ కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ మీటింగ్ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతి ఆన్‌‌లైన్‌‌ పోర్టల్‌‌పై అమ్మే ప్రొడక్ట్‌‌ ఏ దేశానికి చెందినదో తప్పనిసరిగా తెలిపేలా రూల్స్ తీసుకురావాలని ట్రేడర్స్ బాడీ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ పీయూష్ గోయల్‌‌ను కోరింది. దీంతో కొనుగోలుదారులకు ఆ వస్తువు ఎక్కడిదో తెలిసి, కొనుగోలు నిర్ణయం తీసుకుంటారని చెబుతోంది. ఈ ఇష్యూపై ఈ మీటింగ్‌‌లోనే డీపీఐఐటీ ఒక నిర్ణయం తీసుకోనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి.చాలా ఆన్‌‌లైన్‌‌ కంపెనీలు తమ ప్లాట్‌‌ఫామ్స్‌ పై చైనీస్ ప్రొడక్ట్‌‌లనే విక్రయిస్తున్నాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖాండేల్‌‌వాల్ చెప్పారు. ఈ విషయం కన్జూమర్లకు కూడా తెలియదన్నారు. సరిహద్దుల్లో ఇండియా, చైనాకు మధ్య టెన్షన్లు నెలకొన్న క్రమంలో, బాయ్‌‌కాట్ చైనీస్ గూడ్స్ క్యాంపెయిన్‌‌ను ఈ కాన్ఫిడరేషన్ లాంఛ్ చేసింది. దేశవ్యాప్తంగా కూడా యాంటీ చైనీస్ ట్రెండ్ వైరల్ అవుతోంది. ప్రభుత్వ ప్రొక్యూర్‌‌‌‌మెంట్ పోర్టల్ జీఈఎం కూడా తమ ప్లాట్‌‌ఫామ్‌‌పై వస్తువును అమ్మాలంటే, ‘కంట్రీ ఆఫ్ ఒరిజిన్’ అంటే ఏ దేశ వస్తువునో తప్పనిసరిగా తెలుపాలని చెప్పింది. దీంతో మేకిన్ ఇండియా ప్రొడక్ట్ ‌లకు డిమాండ్ పెంచవచ్చని తెలిపింది. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన ఖాండేల్‌‌వాలా, డిపార్ట్‌ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌‌(డీపీఐఐటీ) కూడా ఆన్‌‌లైన్‌‌ కంపెనీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని సూచించింది.