టెన్నిస్, క్రికెట్ పక్కనపెట్టి.. గోల్ఫ్ ఆడుతున్న యాష్లే బార్టీ

వరల్డ్‌ నంబర్‌ వన్‌ టెన్నిస్‌‌‌‌ ప్లేయర్‌..

ప్రొఫెషనల్‌‌‌‌ క్రికెటర్‌ గా విమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ లో పార్టిసిపేట్‌

గోల్ప్ క్లబ్ టోర్నీలోనూ టైటిల్ నెగ్గిన యాష్లే బార్టీ

కరోనాతో గోల్ఫ్ సాధన చేస్తున్న ఆల్ రౌండ్ విమెన్

సిడ్నీ: యాష్లే బార్టీ. వరల్డ్‌ నంబర్‌ వన్‌ టెన్నిస్‌‌‌‌ ప్లేయర్‌ . అంతేకాదు టాలెంటెడ్‌ క్రికెటర్‌ . ఓ వైపు టెన్నిస్‌‌‌‌ ఆడుతూనే ప్రొఫెషనల్‌‌‌‌ క్రికెటర్‌ గా విమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ లో సైతం పార్టిసిపేట్‌ చేసింది.ఇప్పుడు తన మరో టాలెంట్‌ ను బయటపెట్టిందీ ఈ ఆస్ట్రేలియా బ్యూటీ. కరోనా వైరస్‌‌‌‌ భయంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి విత్‌ డ్రా అయిన బార్టీ.. ఈ బ్రేక్‌ లో గోల్ఫ్‌ బాట పట్టింది. ఓ ప్రొఫెషనల్‌‌‌‌ టోర్నీలో బరిలోకి దిగింది. అలాగని ఏదో సరదాగా పార్టిసిపేట్‌ చేయలేదు. బ్రిస్బేన్‌ కు దగ్గర్ లో ని బ్రూక్‌ వాటర్‌ గోల్ఫ్‌ క్లబ్‌ లో జరిగిన ఈ టోర్నీలో మహిళల టైటిల్‌‌‌‌ నెగ్గి ఆశ్చర్యపరిచింది. చేతిలో ట్రోఫీతో, మెన్స్‌ విన్నర్‌ లూయిస్‌‌‌‌ డొబెలార్‌ తో కలిసి దిగిన ఫొటోను సోమవారం తన ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్‌ చేసిన బార్టీ ‘బ్రూక్‌ వాటర్‌ క్లబ్‌ చాంపియన్స్‌’అని రాసింది. 2015-16వ సీజన్‌ లో విమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ లో బ్రిస్బేన్‌ హీట్‌ టీమ్‌ కు ఆడిన బార్టీ.. కరోనా కారణంగా టెన్నిస్‌‌‌‌కు బ్రేక్‌ రావడంతో తన గోల్ఫ్‌ టాలెంట్‌ ను ఇంప్రూవ్‌‌‌‌ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తన బాయ్‌ ఫ్రెండ్‌ గ్యారీ కిసిక్‌ తో కలిసి గోల్ఫ్‌ ఆడుతోంది. కిసిక్‌ ఓ గోల్ఫర్‌ . ప్రొఫెషనల్‌‌‌‌గా మారేందుకు బ్రూక్‌ వాటర్‌ క్లబ్‌ లో ట్రెయినింగ్‌ తీసుకుంటున్నాడు. 2016లో అతనితో బార్టీకి పరిచయం ఏర్పడింది.

 

 

 

Latest Updates