హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆత్మహత్య

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. యూనివర్సిటీలో మెడికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రిషి భరద్వాజ్… వర్సిటీలోని తన క్వార్టర్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్వార్టర్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ప్రొఫెసర్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సమస్యల కారణంగా రిషి భదర్వాజ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Latest Updates