ఆరోగ్యశాఖకు విరాళంగా స్టీఫెన్ హాకింగ్ వెంటిలేటర్

కేంబ్రిడ్జ్: ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కుటుంబం అతని వ్యక్తిగత వెంటిలేటర్‌ను ఇంగ్లండ్ లోని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) ఆస్పత్రికి విరాళంగా ఇచ్చింది. ఆయన కుమార్తె లూసీ హాకింగ్ కేంబ్రిడ్జ్‌ సిటీలోని రాయల్ పాప్‌వర్త్ ఆస్పత్రికి డొనేట్ చేశారు. కరోనా పేషెంట్లకు ఆ వెంటిలేటర్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఖగోళ, భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసిన స్టీఫెన్ హాకింగ్ 2018లో మోటార్ న్యూరాన్ (నరాలకు సంబంధించిన వ్యాధి)తో చనిపోయారు. ఆయనకు సంబంధించిన మెడికల్ వస్తువులన్నింటితో పాటు వెంటిలేటర్ డొనేట్ చేశారు.

Latest Updates