బోర్డు తప్పిదాల వల్లే విద్యార్థుల్లో ఆందోళన : ప్రొ.నాగేశ్వర్

ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని   నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్సీ ప్రో.నాగేశ్వర్ రావును పోలీసులు  అరెస్టు  చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇంటర్ రిజల్ట్స్ లో జరిగిన అవకతవకలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా విద్యార్థులు , తల్లిదండ్రులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాని  తప్పుపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడం కరెక్టు కాదన్నారు. ఇంటర్ బోర్డ్ శైలి పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ఉందన్నారు . బోర్డ్ తప్పిదాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు . బోర్డ్ సరైన పద్దతిలో వ్యాల్యూవేషన్ చెయ్యకుండా… రీవ్యాల్యూవేషన్ చేయించుకోండి అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. వెంటనే ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు.

Latest Updates