పైన అరటి గెలలు.. లోపల నార్కొటిక్ డ్రగ్స్..

విశాఖపట్నం : డ్రగ్స్ ను సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓ పెద్ద గూడ్స్ క్యారియర్ వాహనం నిండా అరటి గెలలు నింపి… అరటి పండ్లను రవాణా చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు కొందరు. ఐతే…. నిఘా అధికారులు ఆ వాహనాన్ని ఆపి తనిఖీలు చేయడంతో… అసలు గుట్టు బయటపడింది.

16వ జాతీయ రహదారిపై తుని నుంచి వస్తున్న టాటా గూడ్స్ క్యారేజీ వాహనాన్ని.. గాజు వాక మండలం.. నాథయ్యపాలెం గ్రామం దగ్గర ఆపి తనిఖీలు చేశారు పోలీసులు. వైజాగ్ రూరల్ యూనిట్ కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమై ఈ ఆపరేషన్ చేశారు. అడిగితే అరటి గెలలు తీసుకెళ్తున్నామన్నారు. పోలీసులు టాటా గూడ్స్ వాహనంపై కవర్లు ఓపెన్ చేసి.. అరటి గెలలు కిందకు దింపి చూశారు. వాటి మధ్యలో నిషేధిత నార్కొటిక్ డ్రగ్స్ గంజాయి నింపిన బస్తాలు ఉన్నాయి.

మొత్తం 865 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. దీని విలువ రూ.86 లక్షల 50వేలు అని చెప్పారు. వైజాగ్ ఏజెన్సీ నుంచి.. హైవే మీదుగా.. జార్ఖండ్ లోని రాంచీకి తీసుకెళ్తున్నారు స్మగ్లర్లు. వాహనం డ్రైవర్, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద… వీరిపై కేసు పెట్టారు.

 

 

 

Latest Updates