జూన్ 14 వ‌ర‌కు చేపల వేట నిషేధం..

రాష్ట్రంలో రెండు నెలల పాటు సముద్ర తీరంలో చేపల వేటను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంతానోత్పత్తి కాలంలో మత్స్య ఉత్పత్తులను సంరక్షించేందుకు నిషేధాజ్ఞల్ని విధిస్తూ మత్య్సశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకూ సముద్ర తీరంలో చేపల వేటను నిషేధించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం 61 రోజుల పాటు రాష్ట్రంలో చేపల వేటపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. సంప్రదాయ బోట్లు మినహా మిగిలిన బోట్లన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలం కావటంతో వాటిని సంరక్షించి వాటి పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఈ నిషేధం విధిస్తున్నట్టు వివరించింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే బోట్లు స్వాధీనం చేసుకోవటంతో పాటు తదుపరి డీజిల్ రాయితీలను నిలిపివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

Latest Updates