ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నేత కార్మికుల మృతి

promises-given-by-the-cm-kcr-must-be-fulfilled

రాష్ట్రంలో చేనేత కార్మికుల మరణాలు నిరసిస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ లో చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు. నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో నేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ రాజ్యసభ ఎంపీ రాగేష్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నేతన్నల ధర్నాకు మద్దతు పలికారు. నేత కార్మికులకు.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వందలాది నేత కార్మికులు చనిపోయారని.. సమస్యలు పరిష్కరించడంతో పాటు.. నేతన్నలకు కూడా పెన్షన్ ఇవ్వాలన్నారు లీడర్లు.