ఆరోపణలు నిరూపించాలి లేదంటే క్షమాపణాలు చెప్పాలి

  • అమిత్ షా లెటర్ పై టీఎంసీ ఆగ్రహం

కోల్ కతా : మైగ్రెంట్ లేబర్స్ ను స్వస్థలాలకు పంపడానికి కేంద్రానికి మమతా సర్కార్ సహకరించటం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై టీఎంసీ సీరియస్ అయ్యింది. అమిత్ షా అబద్దాలు మీద అబద్దాలు చెబుతున్నారని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ విమర్శించారు. అమిత్ షా చేసిన ఆరోపణలను నిరూపించాలని లేదంటే ఆయన క్షమాపణలు చెప్పాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోవటంలో హోంమంత్రి విఫలమయ్యారు. చాలా రోజులుగా సైలెంట్ గా ఉండి ఇప్పుడు అబద్దాలు మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు వలస కార్మికులను గాలికి వదిలేసినా ఇప్పుడు బాధపడుతున్నట్లు నటిస్తున్నారు. అమిత్ షా ఆరోపణలను నిరూపించాలని లేదంటే క్షమాపణలు చెప్పాలి అని అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
8 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేయండి
అమిత్ షా లెటర్ రాసిన వెంటనే బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన బెంగాల్ మైగ్రెంట్స్ లేబర్స్ ను తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను కోరింది. మైగ్రెంట్ లేబర్స్ ను ఆదుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Latest Updates