సిటీలో ప్రాపర్టీ రిటన్ మేళా ప్రారంభం

హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్, వెలుగు: చోరీ జరిగిన సొత్తు తిరిగి వస్తుందో రాదో అనుకునే బాధితులకు శుభవార్త అందచారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. మిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో చోరీలకు పాల్పడిన కేసులలో నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీకి గురైన వస్తువులు, నగలను రికవరీ చేసిన సొత్తును బాధితులకు తిరిగి అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొదటి సారిగ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ నిర్వహించారు. చోరీలకు గురైన సొత్తును రికవరీ చేసి బాధితులకు అందజేశారు మహేష్ భగవత్. బుధవారం రాచకొండ కమిషనరేట్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ..గతంలో ఎక్కడైన చోరి జరిగిన తర్వాత కేసు నమోదు చేసుకుని విచారణ జరిపి నిందితులను పట్టుకుని రికవరీ చేసిన సమయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధితులు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యేవారన్నారు. ఇప్పుడు అలా జరుగకుండా పోయిన సొత్తును బాధితుల చేతికి అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. క

మిషనరేట్ పరిధిలోని హయత్ నగర్, వనస్తలిపురం, బాలాపూర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, మీర్ పేట్, ఘట్ కేసర్, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలలో 23 చోరీ కేసులలో నిందితులైన అంతరాష్ట్ర దోపిడీ ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 41 లక్షల 15 వేల విలువ చేసే 120 తులాల బంగారు నగలు, నాలుగు మోటారు సైకిల్స్, 6 ఎల్ఈడీ టీవీలను స్వాధీనం చేసుకుని రికవరీ సొత్తును బాధితులకు అందజేశారు. దీనివలన బాధితులకు వెంటనే న్యాయం జరిగి కాస్త ఊరట లభిస్తుందని కమిషనర్ తెలిపారు. కోర్టు ద్వారా రికవరీ సొత్తును అందజేయడానికి ఆలస్యం అవుతుందనే కారణంతో ఇక నుంచి ఇదేవిధంగా రికవరీ జరగగానే బాధితులకు అందజేస్తామని రాచకొండ కమిషనర్ తెలిపారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ సర్కిల్లలో ఎప్పటికప్పుడు కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్​ చేసి పోయిన సొత్తును రికవరీ చేసి స్థానిక డీసీపీ కార్యాలయంలో అందచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీపీ చేతుల మీదుగ బాధితు లు పోగొట్టుకున్న సొత్తును, బంగారు నగలను అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నా రు బాధితులు.

 

Latest Updates