ఎట్ల తినాలో.. ఎంత తినాలో తెలుసా?

తినటం కూడా ఒకరు చెప్పాలా అనుకుంటాం కానీ. ఏది తినాలో  ఏ టైంకి ఎంత తినాలో తెలియక పోవటం వల్లనే సగం ఆరోగ్యం పాడవుతోందట.  మన రెగ్యులర్ ఫుడ్‌లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ రెండూ అవసరమే.  లావెక్కుతున్నాం అనే భయంతో ప్రొటీన్ ఫుడ్ ని దూరం పెట్టేస్తుంటారు కొందరు, ఇమ్యూనిటీ పెరగాలి అంటూ ప్రొటీన్ ఉండే ఫుడ్‌నే ఎక్కువగా తింటారు ఇంకొందరు. అయితే మన బాడీకి కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్ రెండూ అవసరమే. ఏది ఎక్కువైనా, తక్కువైనా సమస్యే.

హ్యూమన్ బాడీకి ఇప్పటి లైఫ్ స్టైల్ ప్రకారం 70% వర్కవుట్స్, 30% ఫుడ్ సరిపోతుంది. అయితే… ఏది ఎంత చేయాలో చాలామందికి సరైన నాలెడ్జ్ ఉండటం లేదు. ప్రొటీన్ ఫుడ్ హెల్త్‌‌కి మంచిదే. కానీ, అది ఎక్కువైనా ప్రమాదమే.  అలాగని ఫైబర్ లేని ప్రొటీన్ ఫుడ్ అస్సలు మంచిది కాదు. కార్బోహైడ్రేట్స్ అవసరమే.   అవి ఎక్కువైతే కూడా సమస్యలు తప్పవు. అందుకే ఏ ఫుడ్ ఎంత తినాలో ఎలాంటి డైట్ ఫాలో కావాలో చెబుతున్నారు  డా. లవ్‌‌నీత్‌‌ బాత్రా. ఈ డైట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవంటున్న ఆమె చెప్పిన విషయాలు కొన్ని …

ఫుడ్‌‌ మెనూ ఇలా…..

నిద్రలేవగానే ఒక కప్పు వాటర్, స్పూన్ గోధుమ గడ్డి (వీట్‌‌ గ్రాస్‌‌) పౌడర్‌‌, ఒక టీ స్పూను కొబ్బరి నూనె లేదా టీ స్పూను పీనట్‌‌ బటర్‌‌ కలుపుకొని తాగాలి.

బ్రేక్ ఫాస్ట్‌‌లో ప్రొటీన్లు కలిగిన పదార్థాలలో కొబ్బరి నీళ్లు ఉండాలి. టిఫిన్‌‌లోకి మూడు ఎగ్‌‌వైట్స్‌‌,  ప్రొటీన్ ఉండే శెనగలు, నట్స్ ఉండాలి.  ఒక వేళ వెజిటేరియన్స్ అయితే గుడ్డుకు బదులుగా 100 గ్రాముల పన్నీర్‌‌ కలుపుకోవచ్చు.

లంచ్‌‌కి ముందు ఒక కప్పు మొలకెత్తిన గింజలు, ఒ‍క టీ స్పూన్‌‌ నానబెట్టిన వేరుశెనగలు తినాలి.

భోజనం చేసేటప్పుడు అన్నంతో పాటు ఒక కప్పు పెరుగు, వంద గ్రాముల పన్నీర్‌‌, ఆకుకూరలు, కూరగాయలు ఉండాలి. రొట్టెతో పప్పు లేదా బెండకాయ, కూరగాయలు తింటే సరిపోతుంది.

మధ్యాహ్నం మూడింటికి అంటే లంచ్ చేసిన రెండు గంటల తర్వాత ఏవైనా ఫ్రూట్స్ తీనొచ్చు.  అవి కూడా షుగర్ తక్కువగా ఉండే ఫ్రూట్స్ అయితే బెటర్.

సాయంత్రం ​పూట శ్నాక్స్ తినాలనిపిస్తే  లైట్‌‌ ఫుడ్‌‌ చిప్స్‌‌, బిస్కెట్స్‌‌ లాంటి వాటిని తినాలి. అవసరమైతే  అవకాడో లాంటివి కలిపి తినొచ్చు.  శ్నాక్స్ తినమన్నారు కదాని ఎక్కువ తినొద్దు.

ఏడు గంటలకి  మష్రూమ్‌‌ సూప్‌‌ లేదా వేడిగా ఏవైనా సూప్స్ తీసుకుంటే  ఈవెనింగ్ యాక్టివ్‌‌గా ఉంటారట.

డిన్నర్ చేసేటప్పుడు  బ్రౌన్‌‌రైస్‌‌ అన్నంతో పాటు  150 గ్రాముల సోయా పన్నీర్ (టోఫూ) ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే రెండు చపాతీలతో ఎక్కువ వెజిటబుల్స్ ఉండే మెనూ రెడీ చేసుకోవాలి. రాత్రి పూట వీలైనంత వరకూ నాన్ వెజ్ వద్దు నిద్రకి ముందు నానపెట్టిన అయిదు బాదం గింజల్ని తినడం మంచిది.

ఇలా తినాలి…

ఆర్గాన్స్‌‌ పనితీరు మెరుగ్గా ఉండాలంటే రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల గోరువెచ్చని నీళ్లని ప్రతీ రోజు తాగాలి.

అవసరానికి మించి ప్రొటీన్‌‌ తీసుకోవడం కూడా శరీరానికి ప్రమాదకరమే.గ్యాస్‌‌, అజీర్తి లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రొటీన్ ఎక్కువ తీసుకోకూడదు.  రోజుకు మనకు 25 నుంచి 30 గ్రాముల ప్రొటీన్‌‌ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అయితే అది సమస్యలు తెస్తుంది.

రోజుకి 30 నిమిషాలు వర్కవుట్స్ చేయడం ద్వారా మనం తీసుకునే  ప్రొటీన్‌‌ బాడీకి సరిగ్గా చేరుతుంది.

ఎక్కువ ప్రొటీన్‌‌  శరీరంలో యాసిడ్‌‌ను రిలీజ్‌‌ చేస్తుంది.

మొలకల్ని బాగా నమిలి తినాలి. అంటే గుప్పెడు మొలకలు తినటానికి కనీసం 20 నిమిషాలు తీసుకోవాలి. అలా తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది.

నాన్ వెజ్ తినడం మంచిదే.  కానీ, రోజూ దానికి తగినంత శారీరక శ్రమ చేస్తున్నామా? లేదా?  చూసుకొని దానికి సరిపడేంత మీట్
మాత్రమే తినాలి.

Latest Updates