రామాలయ భూమి పూజ సెలబ్రేషన్స్‌పై టైమ్స్‌ స్క్వేర్‌‌ వద్ద నిరసనలు

న్యూయార్క్: అయోధ్యలో రామ మందిర భూమి పూజ వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని దేశంలోనే గాక విదేశాల్లో ఉన్న ఇండియన్స్ కూడా వీక్షించారు. న్యూయార్క్‌లోని ప్రముఖ టైమ్స్‌ స్క్వేర్స్‌ వద్ద బుధవారం ఇండో అమెరికన్స్ రామ మందిర భూమి పూజ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. యూఎస్‌లోని హిందువుల ఆర్గనైజేషన్ అయిన అమెరికన్ ఇండియన్ పబ్లిక్ అఫైర్స్‌ కమిటీ (ఏఐపీఏసీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఇదే రోజు అయోధ్యలో రామ మందిర భూమి పూజ వేడుకలపై కొందరు వ్యక్తులు టైమ్స్‌ స్క్వేర్‌‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ఇండో అమెరికన్స్, యూఎస్ బేస్డ్‌ సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్‌ యాక్టివిస్ట్‌లు టైమ్స్‌ స్వ్కేర్ ఎదుట ర్యాలీ నిర్వహించారు. హిందువుల సెలబ్రేషన్స్ ఓ కమ్యూనల్ బేస్డ్‌గా ఉన్నాయని నిరసనకారులు ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలిపారు.

‘హిందూయిజంలో రాముడు గౌరవనీయ వ్యక్తి అనేది నిస్సందేహం. ప్లూరలిజంలో భాగంగా అన్ని మతాలను మేం సమానంగా గౌరవిస్తాం. అయితే ద్వేషపూరిత, కిరాతక అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి కొందరు ప్రజలు రాముడి గౌరవాన్ని మసకబార్చుతున్నారు. వాటి దుష్ఫలితాలు ఇండియా వ్యాప్తంగానే గాక యూఎస్‌లో కూడా పెరుగుతున్నాయి. కొందరు అతివాదులు భారత్‌తోపాటు యూఎస్‌లో ముస్లింలను కించపరుస్తున్నారు’ అని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ జనరల్ సెక్రటరీ జవాద్ మహ్మద్ తెలిపారు.

Latest Updates