జాంబాగ్ లో అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ

హైదరాబాద్ : ఎంఐఎం అధినేత.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని పలువురు మహిళలు ఆయనను నిలదీశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జాంబాగ్ డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి రవీందర్ కు మద్దతుగా ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందు సాగుతున్నారు. ఒకచోట మాత్రం ముస్లిం మహిళలు ఒవైసీపై మొహం మీదనే ఏకిపారేశారు. తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారని ప్రశ్నించారు. తాము కష్టాలుపడుతుంటే పట్టించుకోలేదు.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని స్థానిక మహిళలు నిలదీశారు. మహిళల మాటలు విన్న ఆయన వారికి సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగారు.

for more News….

పాతబస్తీలో ఎంఐఎం కోటలు కదిలేనా?

ఖాళీ కుర్చీలతో ఎట్ల పనులైతయ్

గ్రేటర్ ఫలితం తేల్చేది.. ముంపు బాధితులే

సోషల్ మీడియాలో ప్రచారానికి స్పెషల్​ ఏజెంట్లు

సెప్టెంబర్‌ వర‌కు 25 కోట్ల మందికి వ్యాక్సిన్

Latest Updates