రేషన్ కార్డ్ లేని పేదలకు కూడా సాయం అందించాలి

కరోనా రూపంలో ప్రపంచం ఒక విపత్తును ఎదుర్కొంటుంద‌న్నారు కాంగ్రెస్ నేత ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. లాక్ డౌన్ పై ఆయ‌న గురువారం ఫేస్ బుక్ లో లైవ్ లో మాట్లాడారు. క‌రోనా వైర‌స్ మానవ జాతిని ఒక ఆందోళనకర పరిస్థితిలోకి నెట్టేసిందన్నారు. చైనాలో మొదలైన ఈ వైరస్ నేడు అగ్ర రాజ్యమైన అమెరికాను కూడా వనికిస్తుందన్నారు. దేశంలో, తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలు అన్ని ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. 21 రోజులపాటు ఖచ్చితంగా లాక్ డౌన్ పాటించాలన్నారు. సోషల్ డిస్టన్స్, సెల్ఫ్ క్వరంటీన్, ఐసోలేషన్ పాటించాలని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు మీ మీ ప్రాంతాలలో ప్రజలకు పేదలకు సహాయం అందించాల‌ని సూచించారు ఉత్త‌మ్.

ప్రభుత్వం తెలంగాణలో పేదలకు తెల్ల రేషన్ కార్డ్ లు ఉన్న వారికి బియ్యం, 1500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిందని… అది వెంటనే అమలు చేయాలన్నారు. తెల్ల రేషన్ కార్డ్ లేని పేదలను కూడా గుర్తించి సాయం అందించాలని తెలిపారు ఉత్త‌మ్. అలాగే నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడాలని.. గ్రామాలలో వ్యవసాయ దారుల నుంచి వెంటనే ఉత్పత్తలను కొనుగోలు చేసి డబ్బులు ఇస్తే రైతులకు అనుకూలంగా ఉంటుందన్నారు. సమాచార లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు ఉత్త‌మ్.

Latest Updates