ఆకలితో అలమటిస్తున్న సెక్స్ వర్కర్లకు మౌలిక సదుపాయాలు కల్పించండి

  • కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయిన సెక్స్ వర్కర్లకు మద్దతుగా సెక్స్ వర్కర్ల సమిష్టి దర్బార్ మహిళా సమన్వయ కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
ఈ సందర్భంగా సుప్రీంకోర్ట్ సెక్స్ వర్కర్లకు మౌలిక సదుపాయాల్ని కల్పించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం తమ అధికారాలను వినియోగించుకుని వారికి తక్షణ సహాయం అందించగలరా అని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, హేమంత్ గుప్తా ధర్మాసనం కేంద్రాన్ని కోరింది.

తీవ్రమైన ఆందోళనలో ఉన్న సెక్స్ వర్కర్లకు అత్యవసరంగా ఏదో ఒకటి చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్ట్ ఇచ్చే ఆదేశాల కోసం ఎదురు చూడకుండా వారికి ఏదో ఒకటి చేయాలని జస్టిస్ రావు అన్నారు.

అంతేకాదు గుర్తింపు కార్డ్ లు అవసరం లేకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సెక్స్ వర్కర్లకు ఆహారం అందించాలని అత్యున్నత న్యాయ స్థానం పేర్కొంది. సహాయం కోసం అధికారుల్ని ఆశ్రయించే వారికే కాకుండా అందరికి సాయం చేయాలని సూచించింది.

కాగా మార్చి 24,2020 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తరువాత సెక్స్ వర్కర్ల ఆదాయానికి గండిపడిందని, ఏప్రిల్ మరియు మే నెలలలో, సెక్స్ వర్కర్లు తమదగ్గర ఉన్న కొద్దిమొత్తంతో కుటుంబాన్ని పోషించారు. అధిక వడ్డీ రేట్ల వద్ద రుణాలు తీసుకున్నారు. చాలా మంది సెక్స్ వర్కర్లు స్వచ్ఛంద సంస్థలపై ఆదారపడ్డారంటూ హిందుస్తాన్ టైమ్స్ తెలిపింది.

Latest Updates