ట్రాన్స్‌జెండర్లకు పబ్లిక్ టాయిలెట్లు పెట్టాలి: లోక్‌సభలో ఎంపీ రిక్వెస్ట్

లింగ సమానత్వం విషయంలో భారత్ ఇంకా వెనుకబడి ఉందని అన్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ప్రతిమా మోండల్. కేంద్ర ప్రభుత్వం మరిన్ని మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని ఆమె కోరారు. ముఖ్యంగా టాయిలెట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారామె.

లింగసమానత్వంపై ఇవాళ లోక్‌సభలో మాట్లాడారు ఎంపీ ప్రతిమ. టాయిలెట్లన్నవి ప్రతి ఒక్కరికీ ప్రాథమిక అవసరమని అన్నారు. బయటకు వెళ్లిన సమయంలో చాలామంది పబ్లిక్ టాయిలెట్స్ వాడుతుంటామని, కానీ థర్డ్ జెండర్/ట్రాన్స్‌ జెండర్లకు తిప్పలు తప్పడం లేదని చెప్పారామె. టాయిలెట్ల విషయంలో లింగ సమానత్వం ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. ట్రాన్స్‌జెండర్లకు ఎక్కడా టాయిలెట్లు లేవని, వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు ఎంపీ ప్రతిమా మోండల్.

లేటెస్ట్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Latest Updates