ఉద్యోగులకు తీపి వార్త: పీఎఫ్ పై వడ్డీ పెంచారు

ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీరేటును 8.65శాతానికి పెంచినట్లు తెలిపారు కేంద్ర కార్మిక శాక మంత్రి సంతోష్ గాంగ్వర్. దీంతో ఆరుకోట్ల మంది  ఉద్యోగులకు లబ్ది చేకూరనున్నట్లు తెలిపారు. 2018-19 సంవత్సరానికి గానూ వడ్డీ రేటు పెరిగింది. పీఎఫ్ వడ్డీ రేటు పెంచడాన్ని EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులందరూ అంగీకరించారని చెప్పారు. త్వరలో..ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం 8.55 శాతం వడ్డీని ఇస్తున్నారు. 2017-18లో పీఎఫ్ పై వడ్డీ ఐదేళ్ల కనిష్ట స్తాయిలో ఉంది. 2016-17 లో 8.65 శాతం.. 2015-16 లో 8.8 శాతం.. 2017-15, 2013-14లో 8.75 శాతం.. 2012-13 లో 8.5 శాతం వడ్డీ ఇచ్చారు.

 

Latest Updates