కొలంబో పేలుళ్లలో కేరళ వాసి మృతి

PS Raseena, Kerala resident, was one of the victims at Shangri la hotel, Colombo

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మన దేశ  పౌరులు మొత్తం  నలుగురు చనిపోయినట్టు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. మృతి చెందిన వారిలో   కేరళలోని కసరగాడ్ జిల్లాకు చెందిన 58 ఏళ్ల పీఎస్ రసీనా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ సీఎం పినరయ్ విజయన్.. ఆమె మృతదేహాన్ని ఆమె స్వస్థలం మొగ్రాల్ పుత్తూర్ కు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరో ముగ్గురు భారతీయులు లక్ష్మి, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్  గా గుర్తించారు.

కొలంబోలో 8 చోట్ల జరిగిన ఈ పేలుళ్లలో సుమారు 207 మంది చనిపోయారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 35మంది విదేశీయులున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుళ్ల ఘటనలతో కొలంబోలో పెను విషాదం అలముకుంది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాలు, ఆస్పత్రుల వద్ద అంతులేని ఉద్వేగ వాతావరణం నెలకొంది. వరుస బాంబు పేలుళ్లు శ్రీలంకను పెను విషాదంలో ముంచాయి.

Latest Updates