వావ్..! విమానం నుంచి రాకెట్ ను వీడియో తీసిన పైలట్

నెల్లూరు జిల్లా : శ్రీహరికోటలో ఈ ఉదయం PSLV C 45 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది ఇస్రో. PSLV C 45 రాకెట్‌ నింగిలోకి దూసుకెళుతున్నప్పుడు .. ఇండిగో విమానం పైలట్ ఆ వీడియోను తన ఫోన్ తో రికార్డ్ చేశాడు. ఆ టైమ్ లో లాంచ్ సైట్ నుంచి ఇండిగో A 320 విమానం 50 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉంది.

విమానం కాక్‌పిట్‌లో ఉన్న పైలట్‌ కెప్టెన్‌ కరుణ్‌ కరుంబయా.. రివ్వుమంటూ దూసుకెళ్తున్న రాకెట్ ను వీడియో తీశాడు. ఫ్లైట్ లో స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. కుడివైపు కిటికీ నుంచి చూస్తే… పీఎస్ఎల్వీ శాటిలైట్ లాంచ్ ను చూడొచ్చు. బ్యూటీ.. వావ్‌……  అంటూ పైలట్ తో పాటు.. ప్యాసింజర్లు కూడా ఆనందపడ్డారు.

ఈ వీడియో ఇపుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఇవాళ ఉదయం 9.27 గంటలకు నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగంతో… ప్రధాన శాటిలైట్ ఎమిశాట్ తోపాటు.. 28 విదేశీ నానో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు.

 

Latest Updates