ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులకు 15శాతం జీతాల పెంపు..వారానికి 5 రోజుల వర్కింగ్ డేస్ కు నో ఛాన్స్

2017 నుంచి బ్యాంక్ సంఘాలు, ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ బ్యాంక్ యూనియన్స్ (ufbu) కు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (iba) ల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. 2017 నుంచి ప్ర‌భుత్వం బ్యాంక్ ఉద్యోగుల శాల‌రీలు పెంపు పెండింగ్ లో ఉంది. తాజాగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో శాల‌రీల పెంపు స‌మ‌స్య కొలిక్కి వ‌చ్చింది.

ఉద్యోగులు, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ల మ‌ధ్య జరిగిన ఒప్పొందం ప్ర‌కారం.. 2017నుంచి 2022 వ‌ర‌కు ఉద్యోగుల‌కు 15శాతం జీతాల్ని పెంచుతున్న‌ట్లు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ప్ర‌క‌టించింది. దీంతో 12 ప్రభుత్వరంగ, 10 ప్రయివేటు, 7 విదేశీ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. బ్యాంకు ఉద్యోగులకు వేతన పెంపుతో రూ.7,898 కోట్ల వర్షిక అదనపు భారం పడుతోంది.

కాగా కేంద్ర వేతన సంఘ సిఫార్స్ ను వర్తింపచేయ‌డం, వారానికి అయిదు రోజుల పని, కుటుంబ పెన్షన్  వంటి ప్రధాన డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే కుటుంబ పెన్షన్ పథకం డిమాండును ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు ఐబీఏ అంగీకరించింది. ఈ పథకాన్ని బ్యాంకు ఉద్యోగులకు వర్తింపచేయడంపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోనుంది.

Latest Updates