సికింద్రాబాద్ లో సైకో దాడి.. ఒకరి పరిస్థితి విషమం

సికింద్రాబాద్: రోడ్డువెంట నడుచుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై సైకో దాడిచేశాడు. ఈ ఘటన సికింద్రాబాద్ గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగింది. ప్రస్తుతం బాధితుడు చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వైజాక్ కు చెందిన రవిందర్ రెడ్డి అనే వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడేవున్న ఓ సైకో రవిందర్ రెడ్డి తలపై కట్టెతో గట్టిగ కొట్టాడు. కిందపడి స్ప్రహ కోల్పోయిన అతనిపై మరో నాలుగుసార్లు దాడిచేశాడు. పరిస్థితిని గమనించిన మరో పాదచారి సైకోను ఆపకపోయుంటే రవిందర్ రెడ్డి అక్కడే చనిపోయేవాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు. రవిందర్ రెడ్డిని గాంధీ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం రవిందర్ రెడ్డి చావుబతుకుల మధ్య ఉన్నాడని పోలీసులు తెలిపారు. రవిందర్ రెడ్డి విశాఖపట్నం జిల్లా మల్కాపురం గ్రామం గుల్లాల పాలెం కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు.

Latest Updates