పబ్జి ఎఫెక్ట్.. హైదరాబాద్ లో 10th క్లాస్ స్టూడెంట్ సూసైడ్

హైదరాబాద్ : పబ్జి గేమ్ మరో విద్యార్థిని మింగింది. అసలే పదో తరగతి పరీక్షలు. ఫెయిలైతే తమ కొడుకు జీవితం నాశనం అవుతుందనుకున్న తల్లిదండ్రులు.. పబ్జి ఆడొద్దని తిట్టారు. అంతే.. మనస్థాపానికి గురైన టెన్త్ క్లాస్ బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని, మల్కాజ్ గిరిలో జరగగా.. స్థానికంగా విషాదం రేపింది.

మల్కాజ్ గిరిలోని విష్ణుపురి కాలనీలో నివసించే సాంబశివ (16)ను పదో తరగతి చదువుతున్నాడు. సాంబశివకు పబ్జి గేమ్ ఆడటం అలవాటైంది. ప్రతిరోజు ఆడేవాడు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. అయినా సరే గేమ్ ఆడుతుండటంతో.. ఎగ్జామ్స్​ ఉన్నాయికదా, ఇప్పుడు కూడా గేమ్స్​ ఆడితే ఎలా అని మందలించింది బాలుడి తల్లి. దీంతో మనస్థాపానికి గురైన సాంబశివ సోమవారం రాత్రి తన రూంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

తెల్లవారేసరికి ఫ్యాన్ కు వేలాడుతున్న కొడుకును చూసి కన్నీరుమున్నీరయ్యాడు తల్లిదండ్రులు. బాలుడి మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మల్కాజిగిరి పోలీసులు. విద్యార్థులు తమ మంచి భవిష్యత్తును ఆటలతో నాశనం చేసుకోవద్దని సూచించారు పోలీసులు.

Latest Updates