భార‌త్ లోకి ప‌బ్జీ రీ ఎంట్రీ ఇవ్వనుందా!

ప్ర‌ముఖ ముబైల్ గేమ్ ప‌బ్జీ భార‌త్ లో తిరిగి ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. దేశ భ‌ద్ర‌త దృష్ట్యా కేంద్ర‌ప్ర‌భుత్వం కొద్దిరోజుల క్రితం చైనా కు చెందిన 118యాప్ ల‌పై నిషేదం విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్ లో బ్యాన్ చేసిన యాప్ ల‌లో ప‌బ్జీ కూడా ఉంది.

అయితే ప‌బ్జీని త‌యారు చేసిన కొరియా కంపెనీ ప‌బ్జీ కార్పొరేష‌న్ స్పందించింది. వాస్త‌వానికి ప‌బ్జీ గేమ్ కొరియా కు చెందిన ఓ గేమింగ్ కంపెనీ డెవ‌ల‌ప్ చేసింది. ఆ గేమ్ మొబైల్ వెర్ష‌న్ మాత్రం చైనాకు చెందిన టెన్సెంట్ సంస్థ ఇత‌ర దేశాల‌తో పాటు ఇండియాలో ప్ర‌మోట్ చేసింది.

కేంద్ర ప్ర‌భుత్వం ప‌బ్జీని బ్యాన్ చేయ‌డంపై ఆ గేమ్ కొరియా కు చెందిన మాతృ సంస్థ స్పందించింది. భార‌త్ లో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల్ని గ‌మ‌నిస్తున్నామ‌ని, ఇక‌పై ఇండియాలో ప‌బ్జీ గేమ్ ను టెన్సెంట్ సంస్థ ప్ర‌మోట్ చేయబోమ‌ని, తామే స్వ‌యంగా ఇండియా ప‌బ్జీగేమ్ ను ప్ర‌మోట్ చేస్తామ‌ని ప‌బ్జీ కార్పొరేష‌న్ స్ప‌ష్టం చేసింది.

Latest Updates