ప‌బ్జీ బ్యాన్ అయితేనేం : మార్కెట్ లో ప‌‌బ్జీని త‌ల‌ద‌న్నే ఐదు కొత్త గేమ్స్

ప‌బ్జీతో స‌హా 118 చైనా యాప్స్ పై కేంద్ర ప్ర‌భుత్వం బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ప‌బ్జీ బ్యాన్ కావ‌డంపై ఔత్సాహికులు ప్ర‌త్యామ్నాయ యాప్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ప‌బ్జీ బ్యాన్ అయితేనేం ప‌బ్జీలా ఎంట‌ర్ టైన్ చేసే గేమ్స్ చాలా ఉన్నాయి. వాటిలో

కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్

కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ యాప్ గేమ్. ఇది ప్రస్తుతం అత్యంత ప్ర‌జాదార‌ణ పొందిన గేమ్ ప‌బ్జీ త‌ర‌హా గేమ్ ను ఎంజాయ్ చేయోచ్చు. గేమ్ బాగా ఆడితే .. మల్టీప్లేయర్ గేమ్ మోడ్ కూడా ఉంది. ఎత్తుకు పై ఎత్తువేస్తూ ఆట‌ను ఎంజాయ్ చేయోచ్చు.

గారెనా ఫ్రీ ఫైర్

ప‌బ్జీ గేమ్ కు పోటాపోటీగా ఉన్న గేమ్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో అందుబాటులో ఉంది. యుద్ధాన్ని త‌ల‌పించేలా గేమ్ ను డిజైన్ చేసి ఉంది. ఈ గేమ్ ఆడే కొద్దీ అట్రాక్ట్ చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఫోర్ట్ నైట్

ప‌బ్జీ త‌ర‌హాలో ఆడియ‌న్స్ అల‌రించే గేమ్. అయితే ఈ గేమ్ ను ఎపిక్ గేమ్స్ వెబ్‌సైట్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

బ్యాటిల్ ల్యాండ్ రాయ‌ల్

బ్యాటిల్ ల్యాండ్ రాయ‌ల్ సాధార‌ణ‌మైన గేమ్ కాదు. ఇది లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ కాన్సెప్ట్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఒక ట్విస్ట్‌తో బ్యాటిల్ ల్యాండ్ రాయల్ 32 మంది ఆటగాళ్ళు మరియు 3-5 నిమిషాల వార్ న‌డుస్తోంది. ఈ యుద్ధం జ‌రిగే స‌మ‌యంలో ఆయుదాల్ని స్వాధీనం చేసుకోవాలి. బ్ర‌తికేందుకు ప్ర‌య‌త్నం చేయాలి.

షాడోగన్ వార్‌గేమ్స్

షాడోగన్ వార్‌గేమ్స్ ఉచితంగా ఆడే ఫస్ట్-పర్సన్ షూటర్ (FPS) గేమ్. ఇది షాడోగన్ లెజెండ్స్ అరేనాకు కొత్త 5v5 జట్టు-ఆధారిత మల్టీప్లేయర్ గేమ్ తో ఎంజాయ్ చేయోచ్చు. ఆడే ఆట‌తీరును బ‌ట్టి గేమ్ లో ఒక్కో స్టెప్ క్రాస్ చేసుకుంటూ గేమ్ ను ఎంజాయ్ చేయోచ్చు.

Latest Updates