ఒకే ఒక్క సైన్..కేంద్రం చేతిలో పబ్జీ

ఇండియాలో బ్యాన్ అయిన పబ్జీ గేమ్ ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ గేమ్ కు సంబంధించి ఏదో ఒక అంశం చర్చకు రావడంతో పబ్జీ అదిగో అప్పుడు వస్తుంది. ఇదిగో ఇప్పుడే వస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా పబ్జీ గురించి మరో వార్త వెలుగులోకి వచ్చింది.

దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన యాప్స్ తో పాటు గేమ్స్ లను కేంద్రం బ్యాన్ విధించింది. వాటిలో పాపులర్ గేమ్ పబ్జీ కూడా ఉంది. మన దేశ భద్రత దృష్ట్యా కేంద్రం చైనా కు చెందిన పబ్జీని బ్యాన్ చేయడంతో..ఆ గేమ్ ను మళ్లీ ఇండియాలో లాంఛ్ చేసేందుకు చైనా రూ.740కోట్లను ఇన్వెస్ట్ చేస్తూ పేటెంట్ రైట్స్ ను భారత్ కు చెందిన ఓ కంపెనీకి అప్పగించింది. దీంతో  పబ్జీ లవర్స్ ఆ గేమ్ ఎప్పుడు ఇండియాలో విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

తాజాగా కేంద్రం పబ్జీని విడుదల చేసేందుకు అప్రూవల్ ఇవ్వలేదని, ప్రస్తుతం ఆ ఫైల్ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, చేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఫైల్ పై ఒక్క సైన్ చేస్తే..ఇండియాలో పబ్జీ విడుదల కావడం లాంఛనమేనని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Latest Updates