ఫార్మాలిటీస్ కంప్లీట్ : త్వరలో విడుదల కానున్న పబ్జీ

కేంద్రం బ్యాన్ విధించిన పబ్జీ గేమ్ తిరిగి భారత్ లో తన కార్యకలాపాలను కొనసాస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పబ్జీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పబ్జీ  ఇండియాలో అడుగుపెట్టబోతున్నామని ప్రకటించింది. అందుకు అవసరమైన కీలక ప్రక్రియను ఆ సంస్థ పూర్తి చేసింది. కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ వద్ద రిజిస్టర్ చేయించుకుంది. అంతేకాదు సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్ల పేర్లను కూడా ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా పబ్జీ ఇండియా ఈనెల 21న రిజిస్టర్ చేయించుకుంది. కృష్ణన్ అయ్యర్, హ్యునిల్ సోహ్న్ లను డైరెక్టర్లుగా నియమించింది.

 

 

 

Latest Updates