పబ్జీకి పోటీగా ఇండియన్ గేమ్.. ప్లేస్టోర్‌లోకి వచ్చిన ఫౌజీ గేమ్.. కానీ?

ఇండియన్ గేమింగ్ కంపెనీ ఎన్ – కోర్ కు చెందిన ఫౌజీ గేమ్ త్వరలో అందుబాటులోకి రానుంది. దేశ భద్రత దృష్ట్యా కేంద్రం చైనాకు చెందిన గేమింగ్ యాప్ లపై బ్యాన్ విధించింది. వాటిలో పబ్జీగేమ్ కూడా ఉంది. దీంతో భారత్ లోని బెంగళూరు కేంద్రంగా ఎన్ – కోర్ అనే గేమింగ్ కంపెనీ పబ్జీకి పోటాపోటీగా ఫౌజీ గేమ్ ను డిజైన్ చేసింది. గేమ్ ఇంకా లాంచ్ కాలేదు కానీ, మొత్తానికి దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

ఇక ఈగేమ్ టీజర్ ప్రకారం ఈ గేమ్ గాల్వన్ లోయ వివాదం నేపథ్యంలో ఉండగా.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈగేమ్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్టుకి అందిస్తున్నట్లు ఎన్ కోర్ సంస్థ ప్రకటించింది.

Latest Updates