పబ్జీ బంపర్ ఆఫర్ : టోర్నీ గెలిస్తే కోట్లు, గేమ్ ను డిజైన్ చేస్తే లక్షల్లో జీతాలు

భారత్ – చైనాల మధ్య సరిహద్దు వివాదం తలెత్తడంతో కేంద్రం చైనాకు చెందిన ఉత్పత్తుల్ని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో పబ్జీ గేమ్ కూడా ఉంది. అయితే అతిపెద్ద పబ్జీ మార్కెట్ అయిన భారత్ లో మళ్లీ తన కార్యకలాపాల్ని కొనసాగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా  చైనాకు చెందిన ఈ పబ్జీ గేమ్ ఇండియన్ కంపెనీకి పేటెంట్ రైట్స్ ఇచ్చింది. దీంతో పబ్జీ తిరిగి భారత్ లో తన కార్యకలాపాల్ని కొనసాగించనుంది. మరి ఈ గేమ్ భారత్ లో ఎప్పుడు విడుదలవుతుందో స్పష్టత లేనప్పటికి..ఈ నెలలో రిలీజ్ కావొచ్చని గేమింగ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందుకు ఊతం ఇచ్చేలా పబ్జీ నిర్వహించే టోర్నమెంట్ లో గెలిచిన వారికి రూ.6 కోట్లు బహుమతిని అందిస్తున్నట్ల భారత్ కు చెందిన పబ్జీ ప్రొఫెషనల్ గేమర్ అభిజిత్ అందారే ప్రకటించారు. ఇక పబ్జీ గేమ్ ను ఇండియాలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గేమ్ ను డెవలప్ చేస్తున్న టైర్ – 1 డెవలపర్లకు రూ.40వేల నుంచి రూ.2లక్షల వరకు శాలరీలు ఇస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.

 

Latest Updates